హారర్ తో అల్లరోడు రెడీ...

Sunday,October 16,2016 - 01:23 by Z_CLU

అల్లరి నరేష్ ప్రస్తుతం జి. నాగేశ్వరెడ్డి దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయ్యం’. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో అపజయాలకు స్వస్తి పలికి గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేశారు యూనిట్.

కెరీర్ లో తొలి సారి గా చేస్తున్న ఈ హారర్ కామెడి ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు. నవంబర్ 11 నుండి థియేటర్ తను భయపడుతూ నవ్వించడానికి రాబోతున్నాడు. మరి టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములాగా నిలిచిన హారర్ కామెడీ, అల్లరోడుకి కలిసొస్తుందో లేదో చూడాలి.