తెలుగు తెరపై మల్లికా షెరావత్

Wednesday,July 19,2017 - 06:05 by Z_CLU

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ టాలీవుడ్ పై మనసు పారేసుకుంది. రీసెంట్ గా బాహుబలి 2 సినిమా చూసిన మల్లికా షెరావత్ ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయిపోయిందట. మరీ గతంలోలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫామ్ లో లేకపోయినా, ప్రస్తుతం ‘జీనత్’ సినిమాతో బిజీగా ఉన్న అమ్మడూ, కుదిరితే టాలీవుడ్ లో ఎంట్రీ కి రెడీ అంటుంది.

 

బాలీవుడ్ లో ఇప్పటికీ అదే క్రేజ్ మెయిన్ టైన్ చేస్తున్న ఈ హాట్ అండ్ హ్యాప్పెనింగ్ హీరోయిన్, మన ఫిలిం మేకర్స్ గాని రెడీగా ఉంటే, టాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. మరీ ఈ అమ్మడు స్టేట్ మెంట్ ని ఎంతమంది సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.