సక్సెస్ ఫుల్ గా పన్నెండేళ్ళు

Wednesday,July 19,2017 - 07:05 by Z_CLU

టాలీవుడ్ క్వీన్… ఫ్యాన్స్ కి దిల్ కీ ధడ్కన్ అనుష్క శెట్టి, తెలుగు స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి పన్నెండేళ్ళు. నాగార్జున సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయి సరిగ్గా పుష్కరం. జూలై 21 న రిలీజైన సూపర్ సినిమాతో అటు గ్లామర్ తో, ఇటు పర్ఫామెన్స్ తో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేసిన అనుష్క, తెలుగు సినిమా ఆడియెన్స్ కి ఆల్ టైమ్ హాట్ ఫేవరేట్ హీరోయిన్ అనిపించుకుంది.

 

 

కరియర్ బిగినింగ్ లోనే స్టార్ హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేసిన అనుష్క ,హీరోలకు పోటీగా హీరోయిన్  ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి మంచి కమర్షియల్ సక్సెస్ ని అచీవ్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి 2  సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సాధించిన ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఫ్యాన్స్ లో అనుష్క కు ఉన్న క్రేజ్ చూస్తుంటే చూస్తూ, చూస్తూ మరో పుష్కరం కూడా అంతే ఇంటరెస్టింగ్ గా, బిజీ బిజీగా గడిచిపోతుందనిపిస్తుంది.