ఇకపై దూకుడే...

Monday,January 02,2017 - 03:30 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్ళబోతున్నాడు. మురుగదాస్ దర్శకత్వం లో చేస్తున్న లేటెస్ట్ సినిమా ఇటీవలే అహ్మదాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని మరో భారీ షెడ్యూల్ కి రెడీ అయింది. ప్రెజెంట్ ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఈ ట్రిప్ నుంచి రాగానే మరో భారీ షెడ్యూల్ కి రెడీ అవుతాడు. జనవరి 7 నుంచి దాదాపు నెల పాటు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు సాంగ్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

     ఈ సినిమాకు సంభవామి అనే టైటిల్ అనుకుంటున్నారు. దీంతో పాటు మరో 3 టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ… ఏదీ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేసి, టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే, కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్.