2017లో ఏం చేయబోతున్నాడు...

Monday,January 02,2017 - 04:30 by Z_CLU

‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించి పొల్లాచ్చి షెడ్యూల్ ఫినిష్ చేసిన పవన్ కళ్యాణ్.. ప్రెజెంట్ కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీ తో ఓ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. న్యూ ఇయర్ సందర్బంగా వారం పాటు విదేశాల్లో గడిపి జనవరి సెకండ్ వీక్ లో టూర్ నుంచి తిరిగి రాబోతున్న పవన్ తన నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

   జనవరి చివరి వారంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి ఓ షెడ్యూల్ ఫినిష్ చేసి ‘కాటమరాయుడు’ షూట్ లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యాడట పవన్. మరి ఈ రెండు సినిమాలతో పాటు నేసన్ డైరెక్షన్ లో నటించే రీమేక్ సినిమా ను కూడా మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడట పవన్. అంటే ఈ ఏడాది 3 సినిమాలతో పవన్ బిజీగా దూసుకెళ్ళబోతున్నాడన్న మాట.