శివరాత్రికి ఫస్ట్ లుక్ రిలీజ్ ?

Saturday,February 11,2017 - 01:28 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. క్రియేటీవ్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ సీన్స్ ను భారీ ఖర్చు తో చిత్రీకరిస్తున్నారు యూనిట్. అయితే సినిమా ప్రారంభం నుంచి మహేష్ లుక్ పై కాస్త సీక్రెట్ మైంటైన్ చేస్తూ వస్తున్న యూనిట్ టైటిల్ విషయంలో కూడా అదే రీతిలో సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు…

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ‘ఏజెంట్ శివ’,’సంభవామి’ అనే టైటిల్స్ సోషల్ మీడియా లో హంగామా చేస్తున్నప్పటికీ టైటిల్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఫస్ట్ లుక్ తో సర్వప్రయిజ్ చేయాలనీ చూస్తున్నారు యూనిట్. అయితే మహేష్ ఫాన్స్ మాత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎన్నడూ ఎదురుచూడని విధంగా ఆతృత తో ఎదురుచూస్తున్నారు…ప్రెజెంట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శివరాత్రికి రిలీజ్ చేయబోతున్నారనే టాక్ టాలీవుడ్ చక్కర్లు కొడుతుంది .. మరి మహేష్ ఈ పండక్కైనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడా..లేదో చూడాలి..