ఆ డైరెక్టర్ తో నాని...

Saturday,February 11,2017 - 02:16 by Z_CLU

ప్రెజెంట్ వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ లేటెస్ట్ గా ‘నేను లోకల్’ తో గ్రాండ్ హిట్ సొంతం చేసుకున్న నేచురల్ స్టార్ నాని..  ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను క్యూలో పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న నాని… దాని తర్వాత మరో దర్శకుడిని లైన్ లో పెట్టేసాడు…

దిల్ రాజు కాంపౌండ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో నాని ఓ సినిమా చేయబోతున్నాడట. గతంలో ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ డైరెక్టర్ ఇటీవలే రవితేజతో ఓ సినిమాను ప్రారంభించి ఆగిపోయిన సంగతి తెలిసిందే.. ఈ గ్యాప్ లో మరో కథ రెడీ చేసి నానికి వినిపించాడట. ఈ కథ దిల్ రాజు తో పాటు నానికి కూడా బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట నాని. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనుందని సమాచారం.