జులై నుంచి మహేష్-పరశురామ్ మూవీ

Monday,March 23,2020 - 06:04 by Z_CLU

మహేష్ నెక్ట్స్ సినిమా సంగతులు ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. పరశురామ్, వెంకీ కుడుమల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా పరశురామ్ కే ఛాన్స్ ఇచ్చాడు మహేష్. ఇక నిర్మాణ సంస్థలుగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మైత్రీకే అవకాశం ఇచ్చాడు.

తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్ డేట్ కూడా వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులైలో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అంటే.. మహేష్ నెక్ట్స్ మూవీ రిలీజయ్యేది వచ్చే ఏడాదిలోనే అన్నమాట.

ఈ ఇయర్ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాను రిలీజ్ చేశాడు మహేష్. వెంటనే మరో ప్రాజెక్ట్ ను పట్టాలపైకి తీసుకొచ్చినట్టయితే, ఇదే ఏడాది మహేష్ నుంచి మరో సినిమా వచ్చి ఉండేది. కానీ సూపర్ స్టార్ తన చేతిలో ఉన్న స్క్రిప్ట్స్ పై వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాడు. అలా ఈ ఏడాది 2 సినిమాలు రిలీజ్ చేసే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు మహేష్.