జీ సినిమాలు (24th మార్చ్)

Monday,March 23,2020 - 10:04 by Z_CLU

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచుహన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబుజయప్రకాష్పోసాని కృష్ణమురళిప్రభాస్ శ్రీనుసత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీపద్మ ను ఎలా దక్కించుకున్నాడుఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడుచివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి మళ్ళీ ఎలా దగ్గరయ్యాడుఅనేది సినిమా కథాంశం.

_________________________________________

తులసి

నటీనటులు వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

____________________________________________

బ్రహ్మోత్సవం

నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ :  20 మే 2016


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

___________________________________

అహ నా పెళ్ళంట

నటీనటులు అల్లరి నరేష్శ్రీహరిరీతు బర్మేచ
ఇతర నటీనటులు : అనిత హాసనందినిబ్రహ్మానందంఆహుతి ప్రసాద్సుబ్బరాజువిజయ్ సామ్రాట్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : వీరభద్రం
ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరినరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్.

___________________________________

అన్నవరం

నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

_________________________________________

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ

ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : J.B.

డైరెక్టర్ : ప్రభాకర్ P.

ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు

రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.

అయితే ఒకసారి తనకొచ్చిన ఓ  మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.