ఎట్టకేలకి ఆ ప్రొడ్యూసర్ తో మహేష్ ?

Saturday,December 17,2016 - 12:15 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ తో ఎప్పటి నుండో ఓ సినిమా చేయాలనీ చూస్తున్న ఓ అగ్ర నిర్మాత కు మహేష్ లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ అగ్ర నిర్మాత మరెవరో కాదు మహేష్ ను ‘రాజకుమారుడు’ సినిమాతో హీరో గా ఇంట్రడ్యూస్ చేసిన ప్రిన్స్ మొదటి నిర్మాత అశ్వని దత్. అప్పట్లో భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అశ్విని దత్ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.  రీసెంట్ గా అశ్వని దత్ కూమార్తె నిర్మాతగా మారి చిన్న సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బడా నిర్మాత దాదాపు ఎనిమిదేళ్ల నుండి మళ్ళీ మహేష్ తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇప్పటికే మహేష్ తో ‘రాజకుమారుడు’,’సైనికుడు’ సినిమాలను నిర్మించిన అశ్వని దత్ సూపర్ స్టార్ తో ముచ్చటగా మూడో  సారి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

mahesh-babu-aswani-dutt

    ఇక లేటెస్ట్ గా దానయ్య నిర్మాణం లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ సినిమా తర్వాత పి.వి.పి నిర్మాణం లో వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఆ సినిమా విషయం లో ఎం జరిగిందో? తెలియదు గాని ప్రెజెంట్ ఆ సినిమాను అశ్వని దత్ తో ప్లాన్ చేస్తున్నాడట మహేష్. ఇక ఈ సినిమాలో దిల్ రాజు కూడానిర్మాతగా భాగం కానున్నాడనే వార్త వినిపిస్తుంది. మరి ఈ వార్త గాని నిజమైతే ఒకే సినిమాతో ఒకే సారి తన డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు బడా నిర్మాతలకు మహేష్ ఛాన్స్ ఇచ్చినట్టే…