ఆ సాంగ్ తో కుమ్ముడే....

Saturday,December 17,2016 - 03:00 by Z_CLU

మెగా స్టార్ చిరు రిఎంట్రీ ఇస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ టీజర్ రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే మరో సప్రయిజ్ ప్లాన్ చేశారు యూనిట్. రేపు ఈ సినిమాకు సంబంధించిన ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేయబోతున్నారు .

ammadu-kummudu
చిరు సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. డి.ఎస్.పి అందించిన ఈ పాటలో అదిరిపోయే మెగా స్టెప్స్ తో కుమ్మేసాడట చిరు. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సాంగ్ తో మెగా స్టార్ సోషల్ మీడియా లో భారీ వ్యూస్ తో కుమ్మడం ఖాయం అంటున్నారు యూనిట్.