దుమ్ముదులుపుతున్న శాతకర్ణి

Saturday,December 17,2016 - 11:13 by Z_CLU

తెలుగురాష్ట్రాల్లో ఒకేసారి వంద థియేటర్లలో లాంచ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ట్రయిలర్.. సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే ఈ ట్రయిలర్ కు అందరి నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రయిలర్ కు రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. విడుదలైన 5 గంటల్లోనే ఈ ట్రయిలర్ ను యూట్యూబ్ లో 10లక్షల మంది వీక్షించారు. 40వేల మందికి పైగా లైక్ చేశారు.

balakrishna-gautamiputra-satakarni-youtube-record

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ సినిమానే అయినప్పటికీ… అతితక్కువ టైం లో షూటింగ్ పూర్తిచేసి, అందరితో ప్రశంసలు అందుకున్నాడు క్రిష్. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు చిరాాంతన్ భట్ సంగీతం అందించాడు. ఓ కీలకపాత్రలో బాలీవుడ్ మేటి నటి, డ్రీమ్ గాల్ హేమమాలిని నటించింది. సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లలోకి రానుంది.