రేపటితో షూటింగ్ కి ప్యాకప్

Monday,January 30,2017 - 03:51 by Z_CLU

A.R. మురుగదాస్, మహేష్ బాబు సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. సినిమాలోని క్రూషియాల్ పార్ట్ ని హైదరాబాద్ లో షూట్ చేసుకున్న సినిమా యూనిట్ ఈ షెడ్యూల్ కి రేపు ప్యాకప్ చెప్పుకోనుంది. ఇక మిగిలింది టాకీ పార్ట్, సాంగ్స్.

ముంబాయి, పూనే లొకేషన్స్ లలో మ్యాగ్జిమం టాకీ పార్ట్ ని పూర్తి చేయాలని ప్లాన్ లో ఉన్న సినిమా యూనిట్ సాంగ్స్ ని బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్  గా నటిస్తున్న ఈ సినిమా అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.

ఠాగూర్ మధు, NV ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లో కూడా పరిచయం కాబోతున్నాడు.