నాని ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Monday,January 30,2017 - 02:30 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ‘నేను లోకల్’ అంటూ మరో సినిమాతో రెడీ అయ్యాడు. దిల్ రాజు నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు నాని. ఆ విశేషాలు నాని మాటల్లోనే…

 

*ఇప్పటికి సెట్ అయ్యింది

ఎప్పటినుంచో దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయాలనుకున్నా. ఆయన కూడా చాలా కథలు నా దగ్గరికి పంపించి వినమనేవారు. కానీ మా కాంబినేషన్ లో ఓ మంచి కథతో సూపర్ హిట్ సినిమా అవ్వాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకూ వెయిట్ చేశాం. ఎందుకో అప్పుడు సెట్ అవ్వలేదు. ఇక ఆ మధ్య ‘నేను లోకల్’ కథ వినమని రాజు గారు చెప్పడంతో విన్నాను. కథ బాగా నచ్చడంతో వెంటనే రాజు గారికి చేసేద్దాం అని చెప్పా. ఫైనల్ గా మా కాంబినేషన్ లో ఈ సినిమా సెట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది..

 

*యూట్యూబ్ లో చూసి నేర్చుకోనక్కర్లేదు

ఈ కథ వినగానే బాబుగాడిగా కనిపించడానికి పెద్దగా ఏం టైం తీసుకోలేదు. జస్ట్ ఇది నా రెగ్యులర్ క్యారెక్టరే. కాకపోతే కాస్త మాస్ అంతే. ఈ క్యారెక్టర్ చేయడానికి యూట్యూబ్ లో లోకల్ కుర్రాళ్లను చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను లోకలే కదా…

 

*అదే బలం

ఒక్కో మనిషికి ఒక్కో బలం ఉంటుంది. ఆ బలం చూసుకొని ముందుకెళ్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాస్త డిఫరెంట్. నిజం చెప్పాలంటే లోకల్ అనే ఫీలింగే బాబుగాడికి బలం. ఇక క్లైమాక్స్ లో ఓ ఎపిసోడ్ లో టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

 

*దేవి ఎనర్జీ అవసరం అనిపించింది

దేవి నేను కలిసి ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకున్నాం. కానీ కుదరలేదు. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్ లో మాట్లాడనుకునే వాళ్ళం. తన మ్యూజిక్ అంటే నాకిష్టం. నా సినిమాలంటే తనకిష్టం. ఈ కథ వినగానే దేవీ ఎనర్జీ కచ్చితంగా అవసరం అనిపించింది. మేం అనుకునున్నట్లే ఆడియో పెద్ద సక్సెస్ అయింది. ప్రతీ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

*నేను అంతకు మించి

ట్రైలర్ లో మార్చి -సెప్టెంబర్ డైలాగ్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. నాకు అనుభవం ఉంది కానీ నేను మార్చి-సెప్టెంబర్ కి మించిన స్టూడెంట్ ని (నవ్వుతూ)….

 

*ఆ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్

ఒక హీరో కి హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ ఎంత అవసరమో దర్శకుడికి రచయితకి మధ్య కూడా అంతే అవసరం. త్రినాథ్ రావు గారికి ప్రసన్నకి అది బాగా కుదిరింది. ఆయనకేం కావాలో ఈయనకి తెలుసు. ఆయన రాసింది ఎలా తీయాలో ఈయనకి తెలుసు. అది సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ప్రసన్న ఈ సినిమాకి తన పెన్ పవర్ అంతా చూపించాడు.

nani-1

*అన్ని కుదిరాయి

ఈ సినిమా విషయంలో అన్ని బాగా కుదిరాయని నా ఫీలింగ్. దిల్ రాజు గారు, దేవి, కీర్తి సురేష్, త్రినాథ్ రావు, ప్రసన్న ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్ కుదిరారు.

 

*ఆ వార్తలో నిజం లేదు

ఈమధ్య సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి రీషూట్ చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. ఆ వార్తలో నిజం లేదు. చూడగానే మా టీం అందరం నవ్వుకున్నాం. ఈ వార్తలు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ ఒక్కోసారి నవ్వొస్తుంది.

 

*చాలా కాన్ఫిడెంట్

రిలీజ్ కి ఓ 4 రోజులు ముందు సరికొత్త ఫీల్ కలుగుతుంది. మనం ఎవరి కోసమైతే సినిమా చేశామో వాళ్ళు ఇంకొన్ని రోజుల్లోనే సినిమా చూడబోతున్నారనే ఫీలింగ్ ప్రతీ సినిమాకు ఉంటుంది. ఇక ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. కచ్చితంగా బాబుగాడి లవ్ స్టోరీ అందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది.

 

*ఈ ఇయర్ కూడా మూడు

లాస్ట్ ఇయర్ నా నుంచి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ ఇయర్ కూడా మళ్ళీ ఓ 3 సినిమాలు రిలీజ్ అవుతాయి.

 

*ఇప్పుడు ఆ ఆలోచనే లేదు

ఈమధ్య కొందరు మీ డైరెక్షన్ లో సినిమా ఎప్పుడని అడుగుతున్నారు. ప్రెజెంట్ ఆ ఆలోచనే లేదు.  డైరెక్టర్ గా సినిమా చేయాలని మనసులో ఉన్నప్పటికీ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ప్రెజెంట్ హీరోగా మాత్రమే కెరీర్ పై ఫోకస్ పెట్టా. ఆ టైం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా డైరెక్షన్ చేస్తా…

nani-2

*ఈ సారి ఇలా కలిసొచ్చింది

నా ప్రతీ సినిమా ఐమ్యాక్స్ లో రాజమౌళి గారి ఫ్యామిలీ నా శ్రేయోభిలాషులతో చూడ్డం అలవాటు. కానీ ఈ సినిమాను మాస్ థియేటర్ లో చూద్దామనుకున్నా. కానీ నెక్స్ట్ సినిమా షూటింగ్ వల్ల అమెరికా వెళ్లాల్సి వస్తుంది. అక్కడి వాళ్ళతో ప్రీమియర్ చూడబోతున్నా. ఈసారి అలా కలిసొచ్చింది.

 

*ఇప్పుడు అదే ప్రూవ్ అవుతుంది

నా విషయంలో ఎప్పుడూ కంటెంటే సూపర్ స్టార్ అని ఫీలవుతుంటా. అదే నిజం. ఇప్పుడిప్పుడే అది అందరికీ అర్ధం అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మన బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ హిట్స్ సాధిస్తున్నాయి. చాలా హ్యాపీ…

 

* నా ఫోకస్ ఇక్కడే

లాంగ్వేజ్ రాకుండా మనం ఒక నటుడిగా సీన్ ను డెవలప్ చేయలేం. బెస్ట్ ఇవ్వలేం. ఇప్పటికీ కొంత మంది తమిళ్ డైరెక్టర్స్ కొన్ని కథలు వినిపిస్తున్నారు. కానీ ప్రెజెంట్ నా ఫోకస్ అంతా తెలుగులోనే. ప్రెజెంట్ ఇతర లాంగ్వేజెస్ లో మార్కెట్ పెంచేసుకోవాలి అనే ఆలోచన కూడా లేదు..

nani-3

*వాళ్ళు నిజంగానే నా ఫాన్స్

కొన్ని సార్లు షూటింగ్స్ కి వచ్చి కొంతమంది నేను మీ ఫ్యాన్ అంటుంటారు. నిజంగా వాళ్ళు నా ఫ్యాన్స్. ఎందుకంటే ఎవరినో చూసి నా ఫ్యాన్ అని చెప్పే అవసరం వాళ్ళకి లేదుగా. అందుకే అప్పుడప్పుడు వాళ్ళని చూసి సంతోషం కలుగుతుంది.

 

*మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్ లోనే

ప్రెజెంట్ డి.వి.వి.దానయ్య గారి ప్రొడక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తవ్వగానే మళ్ళీ దిల్ రాజు గారి బ్యానర్ లోనే మరో సినిమా చేయబోతున్నా.

 

*వాడు బాగా బిజీ

అవసరాల శ్రీనివాస్ ప్రెజెంట్ యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఓ రెండు మూడు సినిమాలు సైన్ చేశాడు. అవన్నీ ఫినిష్ చేసి వాడు ఫ్రీ అయినప్పుడు కచ్చితంగా చేస్తాం..