పారిస్ లో మహేష్ బాబు

Monday,April 22,2019 - 11:57 by Z_CLU

‘మహర్షి’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ లోపు ఒక్కొక్కటిగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది సినిమా యూనిట్. అయితే మహేష్ బాబు మాత్రం ఎప్పటి లాగే సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం పారిస్ లో ఉన్నాడు మహేష్ బాబు. ఈ  సందర్భంగా పారిస్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూపర్ స్టార్.

‘మహర్షి’ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మహేష్ బాబు. అందుకే ఎప్పటిలాగే సినిమా రిలీజ్ కి ముందే ఎప్పటిలాగే  ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఈ టూర్ నుండి రిటర్న్ వచ్చాక ‘మహర్షి’ ప్రమోషన్స్ తో బిజీ కానున్నాడు మహేష్ బాబు.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘మహర్షి’ సినిమా. మే 9 ఈ సినిమా రిలీజ్ డేట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పివిపి సినిమా సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.