ఒక్కడు సినిమాకి సీక్వెల్

Monday,April 24,2017 - 01:15 by Z_CLU

ఒక్కడు సినిమా సీక్వెల్ కి అంతా సెట్ అయిపోయింది. కాకపోతే తెలుగులో కాదు తమిళంలో. సూపర్ స్టార్ మహేష్ బాబు కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమాను, విజయ్ హీరోగా ‘గిల్లి’ టైటిల్ తో రీమేక్ చేశాడు. తమిళంలో ఈ సినిమాకి ధరణి డైరెక్టర్. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కి గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకున్న ధరణి రీసెంట్ గా విజయ్ కి స్టోరీ వినిపించడం, అందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం టకటకా జరిగిపోయాయి. ఇక సినిమా సెట్స్ పైకి రావడం ఒక్కటే బ్యాలెన్స్.

తెలుగులో ఒక్కడు సినిమాకు సీక్వెల్ రావడం దాదాపు అసంభవం. ఎందుకంటే రీమేక్స్, సీక్వెల్స్ కు మహేష్ చాలా దూరం. ఓ సినిమాకు రీమేక్ లేదా తన సినిమాలకే సీక్వెల్స్ తీయడం తనకు ఇష్టముండదని గతంలో మహేష్ చాలాసాార్లు ప్రకటించాడు. సో.. ఒక్కడు రీమేక్ తమిళ్ కు మాత్రమే పరిమితమన్నమాట.