జూన్ 23న డీజే మాత్రమే

Monday,April 24,2017 - 12:26 by Z_CLU

జూన్ 23 తేదీ చుట్టూ చాలా స్పెక్యులేషన్ నడిచింది. మొట్టమొదట ఆ తేదీని మహేష్ లాక్ చేశాడు. తర్వాత అదే తేదీని నాని కూడా ప్రకటించాడు. వీళ్లిద్దరి తర్వాత బన్నీ కూడా తన డీజే సినిమా విడుదల కోసం జూన్ 23నే ఫిక్స్ చేశాడు. దీంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఫైనల్ గా ఈ ముగ్గురు హీరోల్లో బన్నీ మాత్రమే ఆ తేదీకి వస్తున్నాడు.

జూన్ 23 తేదీ నుంచి మహేష్ దాదాపు తప్పుకున్నట్టే. ఎందుకంటే స్పైడర్ మూవీ షెడ్యూల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. షూటింగ్ కు ఇంకాస్త టైం కావాలి. మరీ ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు డైరక్టర్ మురుగదాస్ చాలా టైం అడుగుతున్నాడు. అందుకే జూన్ 23కు స్పైడర్ రావడం లేదు.

ఇక నాని నటించిన నిన్ను కోరి సినిమా ఆల్ మోస్ట్ ఫినిష్ అయింది. అందుకే జూన్ 23న తేదీకి వస్తున్నట్టు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే, అప్పటికే కాస్తే లేట్ షెడ్యూల్స్ తో నడుస్తున్న డీజే సినిమా కోసం జూన్ 23ను త్యాగం చేశాడట నాని. అలా జూన్ 23కు కేవలం డీజే సినిమా మాత్రమే వస్తోంది.