న్యూయార్క్ లో మహేష్ బాబు ‘మహర్షి’

Monday,October 01,2018 - 02:00 by Z_CLU

U.S. లో షూటింగ్ జరుపుకుంటుంది మహేష్ బాబు మహర్షి టీమ్. ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో ఇంట్రెస్టింగ్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్, U.S. కాన్సల్ జెనెరల్ కేథరిన్ బి. హడా ఇంట్లో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా ఎగ్జైటెడ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కేథరిన్.

2 నెలల భారీ షెడ్యూల్ ని U.S. లో ప్లాన్ చేసుకున్న మహర్షి టీమ్, పక్కా ప్లానింగ్ ప్రకారం, షూటింగ్ జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ లో అమెరికాకి వచ్చిన మహేష్ బాబు & టీమ్, ఏ మాత్రం బ్రేక్ లేకుండా కంప్లీట్ ఫోకస్ ఫిల్మ్ మేకింగ్ పైనే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో U.S. లోని మరిన్ని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కించనున్నారు మేకర్స్.

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ లో నటించనున్నాడు. దిల్ రాజు, PVP తో పాటు అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.