SSMB28 షూటింగ్ షురూ

Monday,September 12,2022 - 01:36 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న SSMB28 షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ? అని ఎదురుచూసిన మహేష్ ఫ్యాన్స్ కి  త్రివిక్రమ్ మహేష్ కి షాట్ ఎక్స్ ప్లేన్ చేస్తున్న  వర్కింగ్ స్టిల్ రిలీజ్ చేసి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో బ్లూ మ్యాట్ వేసి యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు.  మహేష్ – కొందరు ఫైటర్స్ తో షూట్ జరుగుతుంది. ఓ వారం పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్ జరగనుందని, తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ షూటింగ్ మొదలు పెడతారని సమాచారం.

రామోజీ ఫిలిం సిటీతో పాటు అబ్రోడ్ లో కూడా షూట్ జరగనుందని తెలుస్తుంది. సాంగ్స్ కోసం యూనిట్ యూరప్ వెళ్ళే ప్లాన్ లో ఉన్నారు. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే పూజ షూట్ లో జాయిన్ అవ్వనుంది. ఖలేజా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ -త్రివిక్రమ్ కాంబో ఎట్టకేలకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతూ షూటింగ్ మొదలు పెట్టారు.

హారికా హాసినీ క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజర్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కానుంది.