నైట్ ఎఫెక్ట్ లో మహేష్ బాబు

Thursday,January 19,2017 - 07:50 by Z_CLU

ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా డిలేస్ కి చాన్సెస్ ఇవ్వకుండా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది మహేష్ బాబు, AR మురుగదాస్ సినిమా. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్ మహేష్ బాబు కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. జనవరి 29 వరకు ‘మహేష్ 23’ టీం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది.

హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లోను గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.