ఇంటర్నేషనల్ స్థాయిలో ‘నా పేరు సూర్య’ సినిమా

Wednesday,April 18,2018 - 03:48 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని మేకర్స్,  సినిమాలోని రొమాంటిక్ సాంగ్ ‘లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో’ సాంగ్ ని మరింత ఎట్రాక్టివ్  గా  తెరకెక్కించారు. ఈ సాంగ్ కోసం  పాప్యులర్  హాలీవుడ్  టెక్నీషియన్స్  పని చేయడంతో , ఈ సాంగ్  సినిమాలో వన్ ఆఫ్  ది హైలెటెడ్  ఎలిమెంట్  కానుంది.

 ఈ సాంగ్ కోసం పాప్యులర్ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జోసెఫ్ లబిసి పని చేశారు. ప్రముఖ పాప్ సింగర్స్ అరియాణ గ్రాండే, ఎనరిక్యూ ఇగ్లిసియ్స్, నికీ మిజాన్ లాంటి వరల్డ్ వైడ్ పాప్యులారిటీ ఉన్న స్టార్స్ కి పని చేసిన జోసెఫ్ ఈ సినిమాకి పని చేయడంతో ‘నా పేరు సూర్య’ సినిమాకి మరింత పాప్యులారిటీని తెచ్చి పెడుతుంది.

కేవలం విజువలైజేషన్ విషయంలోనే కాదు, ప్రముఖ హాలీవుడ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ ‘ఆన్ మేరీ హుగ్’ ఈ సాంగ్ కోసం పని చేయడంతో ఈ సాంగ్ లో బన్ని లుక్స్ పై అప్పుడే డిస్కర్షన్ కూడా బిగిన్ అయిపోయింది. ప్రస్తుతం ఫేమస్ పాప్ క్వీన్ జెన్నీఫర్ లోపెజ్ తో పాటు నికే మినాజ్ లాంటి పాప్యులర్ సింగర్స్ కి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్న యాన్, ఈ సాంగ్ కోసం కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంతో ‘నా పేరు సూర్య’ సినిమాని ఫిల్మ్ మేకర్స్ ఎంత గ్రాండియర్ కాన్వాస్ పై తెరకెక్కిస్తున్నారో తెలుస్తుంది.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ కోసం రెడీ అవుతుంది. ఈ నెల 22 న మిలిటరీ మాధవరంలో గ్రాండ్ గా ఆడియో  లాంచ్ జరుకోనుంది  నా పేరు సూర్య  టీమ్. ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ ప్రొడ్యూసర్.