Acharya - రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Wednesday,October 06,2021 - 03:19 by Z_CLU

Chiranjeevi Acharya Release Date

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య‘ (Acharya Movie) సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా ? అని మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ముందుగా దసరా కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత వచ్చే సంక్రాంతి కి అనుకున్నారు. కానీ సంక్రాంతి కి స్పేస్ లేకపోవడంతో ఇప్పుడు డిసెంబర్ కి షిఫ్ట్ అయినట్టు సమాచారం.

అవును డిసెంబర్ లో ఓ డేట్ అనుకోని ప్రమోషన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ అదే నెలలో రాబోతుంది. డిసెంబర్ 17న రిలీజ్ అంటూ ఇప్పటికే మేకర్స్ ఎనౌన్స్ చేశారు. సో ఆచార్య డిసెంబర్ 24 న విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మేకర్స్ కూడా ఈ డేట్ కన్ఫర్మ్ చేసి త్వరలోనే ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తుంది.

కొణిదెల ప్రొడక్షన్ కంపేనీ బేనర్ పై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నిరంజన్ రెడ్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే (Pooja Hegde) నటిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. త్వరలోనే ఆచార్య కొత్త డేట్ తో ప్రమోషన్ మొదలు కానుంది. మరి ఆచార్య సంక్రాంతి కి ముందే హంగామా మొదలు పెట్టు సంక్రాంతి వరకూ ఆ సందడి కొనసాగిస్తుందా? చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics