Koratala Siva - సోషల్ మీడియాకి గుడ్ బై!

Saturday,June 26,2021 - 12:33 by Z_CLU

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ విషయంలో సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందో తెలిసిందే. కేవలం సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు సెలబ్రిటీస్. అయితే కొందరు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంటే ఇంకొంత మంది మాత్రం దీనికి దూరంగా ఉంటున్నారు. తాజా సోషల్ మీడియాకి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ గుడ్ బై చెప్పేశారు.

తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సందర్భాల్లో పోస్టులు పెట్టే ఈ దర్శకుడు ఇకపై సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. “నేను సోషల్ మీడియా నుండి వెళ్ళిపోతున్నాను. దీని ద్వారా మీతో ఎన్నో విషయాలు పంచుకున్నాను. కానీ ఇప్పుడు వీటన్నిటినీ వదిలేయాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే సోషల్ మీడియాలో లేకపోయినా మీడియా మిత్రుల ద్వారా మీతో ఇంట్ట్రాక్ట్ అవుతూ టచ్ లో ఉంటాను. మీడియం మాత్రమే మారింది మన బాండింగ్ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతుంది” అంటూ ఓ లెటర్ పోస్ట్ చేసి అభిమానులకు విషయం చెప్పాడు కొరటాల.

అయితే ఉన్నట్టుండి కొరటాల సోషల్ మీడియా నుండి బయటికి వచ్చేయడంతో… కొరటాల తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని కొందరు అభిమానులు అనుకుంటుంటే మరికొందరు మాత్రం తమ హీరోల అప్డేట్స్, అలాగే మిగతా విషయాల గురించి ఇకపై కొరటాల నుండి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు ఉండవని తెలిసి ఫీలవుతున్నారు.

మరి కొరటాల సోషల్ మీడియా నుండి కొన్ని నెలలు మాత్రమే బ్రేక్ తీసుకున్నారా ? లేదా శాశ్వతంగా స్వస్తి చెప్పేసినట్టేనా ? తెలియాల్సి ఉంది.ప్రస్తుతం మెగా స్టార్ తో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న కొరటాల శివ నెక్స్ట్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics