మరికొన్ని గంటల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Saturday,August 05,2017 - 05:45 by Z_CLU

ఆగష్టు 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది నితిన్ ‘లై’. రీసెంట్ గా రిలీజైన 3 పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ డోస్ పెంచేసిన సినిమా యూనిట్, ప్రీ రిలీజ్  ఈవెంట్  ను మరికాసేపట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయనుంది. హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ ను జీ సినిమాలు ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానెల్ లో లైవ్ చూడొచ్చు.

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన లై సినిమా ఇప్పటికే బోలెడంత క్యూరాసిటీ ని రేజ్ చేస్తుంది. టీజర్ దగ్గరి నుండి, నితిన్ ని మోస్ట్ స్టైలిష్ లుక్స్ తో ప్రజెంట్ చేసిన ట్రేలర్ వరకు ప్రతి ఎలిమెంట్ తో అంచనాల్ని పెంచేసింది.  దానికి తోడు తాజాగా విడుదలైన 3 సాంగ్స్ సినిమాపై భారీ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాయి.

మేఘా ఆకాష్ హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.