ఫస్ట్ లుక్ తో హంగామా చేస్తున్న రామ్

Saturday,August 05,2017 - 11:36 by Z_CLU

‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్-కిశోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ‘స్రవంతి’ రవికిశోర్, పి.ఆర్‌. సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ బ్యానర్ పై కష్ణచైతన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ అంటూ రామ్ స్నేహితులతో కలిసి జీప్ నడుపుతున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై అంచనాలను పెంచేసింది.

రామ్ సరసన అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 7న ఊటీలో మరో షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు యూనిట్. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. స్నేహం, ప్రేమ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ సినిమాలోని దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు…’ అనే పాటను ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నాం. ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.