100% లవ్ రీమేక్ లో లావణ్య త్రిపాఠి

Thursday,June 29,2017 - 03:02 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న లావణ్య త్రిపాఠి అకౌంట్ లో మరో ఆఫర్ వచ్చి పడింది. తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమా తమిళ రీమేక్ లో హీరోయిన్ గా ఫిక్సయింది లావణ్య త్రిపాఠి. GV ప్రకాష్ కుమార్ హీరోగా నటించనున్న ఈ సినిమాని తమిళంలో M.M. చంద్రమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో ఈ క్యారెక్టర్ కోసం తమన్నా, హెబ్బా పటేల్ అనుకున్నా లక్కు మాత్రం లావణ్యకే దక్కింది. ఈ క్యారెక్టర్ కోసం ఆల్ రెడీ బరువు కూడా తగ్గించుకునే పనిలో ఉన్న లావణ్య, ఈ సినిమా సక్సెస్ తో తమిళ నాట కూడా  బిజీ అయిపోవడం ఖాయమనే అనిపిస్తుంది.

 

తెలుగులో సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నాగ చైతన్య కరియర్ లో మెమోరబుల్ స్పేస్ ని ఆక్యుపై చేసింది. బావా మరదళ్ళ మధ్య సరదాగా సాగే ప్రేమకథ తో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తమిళం లోను అంతే సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.