లేటెస్ట్ ముస్తాఫా బ్యాచ్

Friday,September 09,2016 - 12:32 by Z_CLU

 

తెలుగులో హీరోల మధ్య ఎంత పోటీ ఉందో మనం రోజూ చూస్తునే ఉన్నాం. ఒక హీరో రికార్డు సృష్టిస్తే దాన్ని క్రాస్ చేయడానికి మరో హీరో ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఇలా హీరోలంతా రికార్డులు, కలెక్షన్ల లెక్కలతో బిజీబిజీ. ఇలాంటి టైమ్ లో హీరోల మధ్య బంధాలు, అనుబంధాలు ఏముంటాయని చాలామంది అనుకుంటారు. కానీ సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరని నిరూపిస్తున్నారు మన యంగ్ స్టార్స్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… అప్పుడప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటారు. వీలు దొరికితే హ్యాంగ్ అవుట్స్ లో ఎంజాయ్ చేస్తుంటారు.

ntr-allu-arjun

టాలీవుడ్ లేటెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్-బన్నీ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. క్రేజ్ పరంగా చూసినా, కుటుంబ నేపథ్యం చూసినా వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఒకే స్టేజ్ పై తారక్-బన్నీ కలిసి కనిపిస్తే… మెగా ఫ్యాన్స్ తో పాటు నందమూరి అభిమానులు ఉప్పొంగిపోయారు. కొంతమంది గాసిప్ రాయుళ్లయితే మరో అడుగు ముందుకేసి బడా కాంబినేషన్ అంటూ పుకార్లు కూడా పుట్టించారు.

nithin-akhil

హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే నితిన్-అఖిల్ మంచి ఫ్రెండ్స్. వీళ్ల స్నేహం ఎంత బలమైందంటే… అఖిల్ హీరోగా మారతానంటే.. ఆ సినిమాకు నితిన్ ఏకంగా నిర్మాతగా మారిపోయాడు. ఆ రేంజ్ ఫ్రెండ్ షిప్ వీళ్లది. ఇప్పటికీ వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ కలుసుకుంటారు. అఖిల్ కు బోర్ కొడితే నితిన్ సెట్స్ లోకి వచ్చి వాలిపోతుంటాడు.

prabhas-rana-still

ముస్తాఫా బ్యాచ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి మరో కాంబినేషన్ ప్రభాస్-రానా. బాహుబలి సినిమాలో వీళ్లిద్దరి మధ్య వైరం ఉండొచ్చు కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. స్నేహమంటే ఇదేరా అనే టైపులో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. పైగా ప్రభాస్ అంటే హీరోలందరికీ డార్లింగ్. ఇక రానాకైతే ఇండస్ట్రీలో ప్రభాస్ ను మించిన బెస్ట్ ఫ్రెండ్ లేడంటారు.

chaithu-tej

కెరీర్ స్టార్టింగ్ నుంచే నాగచైతన్యకు సింక్ అయ్యాడు సాయిధరమ్ తేజ. హీరోగా పరిచయం కాకముందే నాగచైతన్య-తేజు మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది. పిల్లా నువ్వులేని జీవితం సినిమా తర్వాత ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. వీళ్లతో పాటు మహేష్ బాబు-సుమంత్, రవితేజ-ప్రకాష్ రాజ్, పవన్-వెంకటేష్ కూడా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.