మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్

Friday,September 09,2016 - 11:40 by Z_CLU

ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విషయంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాటనిలబెట్టుకున్నాడు. ఎప్పుడో మూడేళ్ల కిందట ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని మరీ ఇప్పుడు దాన్ని నెరవేర్చుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఫైట్ మాస్టర్స్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. చిరంజీవి 150వ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్న రామ్-లక్ష్మణ్… చరణ్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

ram_lakshman

గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ టైమ్ లోనే… చిరంజీవితో సినిమా అవకాశం కల్పిస్తానని ఈ ఫైట్ మాస్టర్స్ కు చెర్రీ మాటిచ్చాడు. ఆ తర్వాత ఎన్నో రోజులు గడిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు చెర్రీ గుర్తుపెట్టుకొని మరీ రామ్ లక్ష్మణ్ లను పిలిపించాడు. చిరంజీవి 150వ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశాన్ని కల్పించాడు. చిరంజీవి నటించిన జేబుదొంగ సినిమాతోనే పరిశ్రమకొచ్చారు రామ్-లక్ష్మణ్. మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాల్లో ఫైటర్స్ గా కనిపించారు. ఎట్టకేలకు చిరంజీవి సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం రావడంతో తమ కడుపు నిండిందంటున్నారు ఈ ఫైట్ కంపోజర్లు.