'బాహుబలి-2' లో నాగార్జున

Friday,September 09,2016 - 03:30 by Z_CLU

బాహుబలి బంపర్ హిట్ అయింది. రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. టాలీవుడ్ లోనే బెంచ్ మార్క్ మూవీగా నిలిచింది. ఇలాంటి సినిమాకు పార్ట్-2 రెడీ అవుతోంది. దీన్ని మరింత గ్రాండియర్ గా ప్రజెంట్ చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ ను కూడా తీసుకోవాలని అనుకున్నాడు రాజమౌళి. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి హీరోల పేర్లు వినిపించాయి. ఇటు కోలీవుడ్ నుంచి అయితే సూర్య దాదాపు కన్ ఫర్మ్ అనే ప్రచారం కూడా జరిగిపోయింది. కానీ స్టార్ కాస్ట్ లో మార్పులు లేకుండానే బాహుబలి-2 షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ప్రాజెక్టులోకి నాగార్జున ఎంటర్ అయ్యాడు. ఈసారి మాత్రం ఇది పుకారు కాదు. నిజంగా నిజం.

బాహుబలి-2లో నాగార్జున తెరపైన కనిపించకపోయినప్పటికీ… బిజినెస్ లో భాగమయ్యాడు. అవును… సినిమాకు సంబంధించి కృష్ణా జిల్లా పంపిణీ హక్కుల్ని నాగార్జున దక్కించుకున్నట్టు తెలుస్తోంది. నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున బాహుబలి-2 హక్కుల్ని దక్కించుకున్నాడని టాక్. అలా బాహుబలి-2లో మన్మధుడు కూడా భాగమయ్యాడు.