NTR త్రివిక్రమ్ సినిమాలో కీ ఎలిమెంట్

Saturday,February 17,2018 - 02:25 by Z_CLU

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది NTR త్రివిక్రమ్ మూవీ. మ్యాగ్జిమం మార్చి 23 నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది మూవీ టీమ్. అయితే మరోవైపు రీసెంట్ గా ‘జైలవకుశ’ లాంటి పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేసిన NTR, ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడోనన్న క్యూరాసిటీ ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది.

అయితే మ్యాగ్జిమం స్క్రిప్ట్ వర్క్ కి ప్యాకప్ చెప్పేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో తన మార్క్ కామెడీ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

సినిమాలోని తక్కిన స్టార్ కాస్ట్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమాకి సంబంధించిన కీ టెక్నీషియన్స్ తో పాటు, హీరోయిన్ డీటేల్స్ ని అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉంది. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని చినబాబు నిర్మిస్తున్నారు.