అ! మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ

Saturday,February 17,2018 - 04:09 by Z_CLU

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది ‘అ!’ మూవీ. నాని నిర్మించిన ఈ సినిమా క్రిటిక్స్ ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు అవి మీ కోసం…

ఎక్స్ పెక్ట్ చేసిందే జరిగింది…

సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నదుకు చాలా హ్యాప్పీ. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వినిపించినా, ఇంకోసారి సినిమా చూస్తే, తప్పక నచ్చుతుంది.

అలా మొదలైంది…

ఏదైనా చిన్న సినిమా చేద్దామని రాయడం బిగిన్ చేశాను. అంతలో ఎక్స్ ప్రెషనిజం పై ఇప్పటి వరకు సినిమా రాలేదు కదా. తెలుగులో ట్రై చేద్దామనిపించి ఇలా రాసుకున్నాను. పర్టికులర్ గా ఇన్స్ పిరేషన్ అంటూ ఏమీ లేదు.

నేనే అనుకున్నాను…

డిఫెరెంట్ స్టోరీ కాబట్టి ప్రొడ్యూసర్స్ దొరకడం కష్టమనిపించి నేనే ఎలాగోలా ప్రొడ్యూస్ చేసుకుందామనుకున్నా… నాని గారిని కూడా జస్ట్ వాయిస్ ఓవర్ కోసం అప్రోచ్ అయ్యాను. కానీ ఆయన స్టోరీ విన్నాక సినిమా నిర్మించే ధైర్యం చేశారు.

కొంచెం భయపడ్డాను…

నాని గారు ప్రొడ్యూస్ చేస్తాను అనగానే హ్యాప్పీగా అనిపించినా, మరోవైపు భయమేసింది. ఈ సినిమా ఒకవేళ సక్సెస్ కాకపోతే నాని గారి క్రెడిబిలిటీ పోతుంది. ఆ విషయం ఆయనతో కూడా చెప్పాను. కానీ ఆయన సినిమాని నా కన్నా ఎక్కువగా నమ్మారు…

నేను అనుకోలేదు…

నేను స్టోరీ రాసుకున్నప్పుడు నాని గారు, రవితేజ గారు అని అసలనుకోలేదు కానీ, ఫ్రెండ్స్ కి స్టోరీ చెప్తునప్పుడు, నేను చెప్పే  యాసని బట్టి వాళ్ళకే రవితేజ గారి మాడ్యులేషన్, నాని గారి మాడ్యులేషన్ అనిపించి.. వాళ్ళే  అనేవారు.. అలా నేనూ ఫిక్సయ్యాను…

బాధ్యత అనిపించింది…

సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం బాధ్యత అనిపించింది. అదే పనిగా మెసేజ్ కోసమే సినిమా కాకుండా,  ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మెసేజ్ కూడా పెడితే బావుంటుందనిపించింది.

అంతకన్నా కాంప్లిమెంట్ ఉండదు…

సినిమా చూశాక చాలామంది ఇంత మంచి సినిమా చేసినందుకు బావుంది, ఎంజాయ్ చేశాం లాంటి మాటలు కాకుండా ‘థాంక్స్’ అని చెప్తున్నారు. అంతకన్నా ఫిల్మ్ మేకర్ కి బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది.

 

ప్రతీది కరెక్ట్ గా ప్లేస్ అయింది…

సినిమాలో కాస్టింగ్ దగ్గరి నుండి గెటప్స్ వరకు ప్రతీది పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. చాలా కేర్ తీసుకున్నాము…. చాలా డబ్బులు స్పెండ్ చేశాము. రెజీనా గారి ట్యాటూ కోసం ముంబై నుండి ‘జో’ అని ఆర్టిస్ట్ ని పిలిపించాం. ఆయన ఇండియాలోనే నంబర్ 1 ట్యాటూ ఆర్టిస్ట్.  ఆ ట్యాటూ వేయడానికి 12 గంటలు పట్టేది.

రెజీనా గారు చాలా కష్టపడ్డారు…

రెజీనా గారు ప్రతి షెడ్యూల్ లో స్నానం చేయడం మానేయాల్సి వచ్చింది. ట్యాటూపోతుందని. సరిగ్గా పడుకున్నా… వెనకాల ఉన్న ట్యాటూ పోతుంది కాబట్టి ఒకవైపే పడుకునే వారు. జుట్టు కూడా ప్రతి షెడ్యూల్ కి ట్రిమ్ చేసుకోవాల్సి వచ్చింది.

డిప్రెషన్ అనేది బర్నింగ్ ప్రాబ్లమ్…

డిప్రెషన్ అనేది ప్రస్తుతం ఇండియాలో చాలా బర్నింగ్ ప్రాబ్లమ్. ఒక్కోసారి డిప్రెషన్ ఉన్న వాళ్లకు, వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నాం అన్న విషయం కూడా తెలీదు. ఈ విషయంలో అవేర్ నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా కొంతలో కొంత హెల్ప్ చేస్తుందనే అనుకుంటున్నా…

 

అందుకే అ!…

అ! అనేది షాకింగ్ ఎక్స్ ప్రెషన్. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ బావుంటుందనుకున్నాం. నాని గారికి చెప్పినప్పుడు కూడా, ఇద్దరికీ ఫాస్ట్ మూవీ కాబట్టి అ లెటర్ పర్ఫెక్ట్ అనుకున్నాం.

చాలా చేశాను…

నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ తరవాత  షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేశాను. చాలా ఆడ్ ఫిలిమ్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్.

చాలా హ్యాప్పీ…

సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం అనేది గ్రేట్ అచీవ్ మెంట్. ఇక్కడ ప్రసాద్స్  లో, చెన్నై బెంగళూరు, U.S. లో కూడా చాలా థియేటర్స్ లో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు…

ఎక్స్ పెక్ట్ చేయడం లేదు…

నేనైతే అవార్డ్స్ కోసం చేసిన సినిమా కాదిది. కానీ వస్తాయనుకుంటున్నా… నాకు రాకపోయినా ఆర్ట్ డిపార్ట్ మెంట్, కెమెరా మెన్.. టెక్నీషియన్స్ కి రావాలని కోరుకుంటున్నా….