Keerthy Productions - ప్రొడ్యూసర్ గా కీర్తిసురేష్

Saturday,September 05,2020 - 06:43 by Z_CLU

నిన్నట్నుంచి కోలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ‘మహానటి’ త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతోందనేది ఆ గాసిప్. మరీ ముఖ్యంగా స్ట్రయిట్ మూవీస్ కాకుండా.. ఓటీటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

ఈరోజు దీనిపై Keerthy Suresh టీం స్పందించింది. కీర్తికి ప్రస్తుతం నిర్మాతగా మారే ఉద్దేశం లేదని, తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని స్పష్టంచేసింది.

కీర్తిపై ఇలా పుకార్లు రావడం కొత్తేంకాదు. మొన్నటికిమొన్న ఆమెకు పెళ్లి సెట్ అయిందంటూ ప్రచారం జరిగింది. రీసెంట్ గా ఆదిపురుష్ లో హీరోయిన్ గా తీసుకున్నారంటూ స్టోరీలు వచ్చాయి. ఇలా ఎప్పటికప్పుడు కీర్తిపై కథలు రావడం కామన్ అయిపోయింది. ఇప్పుడు Keerthy Suresh Producer అనేది కూడా రూమరే.