జిమ్ ట్రయినర్ కు రేంజ్ రోవర్

Saturday,September 05,2020 - 06:35 by Z_CLU

తన సిబ్బంది, స్నేహితులకు ప్రభాస్ ఎంత వెయిట్ ఇస్తాడనేది మరోసారి ప్రూవ్ అయింది. తన జిమ్ ట్రయినర్ కు ఏకంగా రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు Prabhas. ప్రస్తుతం ఈ మేటర్, ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ కు కొన్నేళ్లుగా పర్సనల్ జిమ్ ట్రయినర్ గా పనిచేస్తున్నాడు లక్ష్మణ్. ప్రతి నెల భారీ జీతం అందుకుంటున్నాడు. అయినప్పటికీ లక్ష్మణ్ పై ఇష్టంతో ఇలా Range Rover ప్రజెంట్ చేశాడు Prabhas.

ప్రస్తుతం Adipurush సినిమా కోసం లక్ష్మణ్ పర్యవేక్షణలోనే కొత్తగా వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు ప్రభాస్. బాహుబలి కోసం భారీగా కండలు పెంచిన ఈ హీరో, ఆదిపురుష్ లో శ్రీరాముడి పాత్ర కోసం విలుకారుడు (Archer) లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.