షెడ్యూల్ పూర్తి చేసిన 'కాటమరాయుడు'

Saturday,December 24,2016 - 05:30 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వం లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో పవన్, శృతి లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు యూనిట్. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ ,శృతి హాసన్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయం అని లేటెస్ట్ గా పొల్లాచ్చి లో షూట్ చేసిన రొమాంటిక్ సీన్స్, సాంగ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ఆ లొకేషన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయని తెలియజేసారు చిత్ర యూనిట్.

లేటెస్ట్ గా పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసి హైదరాబాద్ తిరిగి వచ్చిన యూనిట్ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ షెడ్యూల్ ఫినిష్ అవ్వడం తో  ఓ టూర్ ప్లానింగ్ ఉన్న పవన్ ఆ టూర్ నుంచి వచ్చాకే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడని సమాచారం.