'కాటమరాయుడు' రెడీ అవుతున్నాడు

Sunday,January 22,2017 - 10:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రెజెంట్ కాస్త బ్రేక్ తీసుకున్న టీం త్వరలోనే మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ , మేకింగ్ వీడియో తో హంగామా చేసిన ‘కాటమరాయుడు’ త్వరలో సాంగ్స్ తో హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్న పవన్ ఆ షెడ్యూల్ పూర్తయినవెంటనే ప్రమోషన్ మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఆడియో రిలీజ్ వేడుకను ఫిబ్రవరి లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అంటే ఫిబ్రవరి నుంచే కాటమరాయుడు హంగామా స్టార్ట్ అవ్వబోతుందన్నమాట.