హీరోలంతా బాగా పెంచేస్తున్నారు...

Sunday,January 22,2017 - 12:10 by Z_CLU

హీరోలు బాగా పెంచేస్తున్నారంటే ఒకప్పుడు రెమ్యునరేష్ అనే అర్థం మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పారితోషికం కంటే ముందు హీరోలంతా గడ్డాలు బాగా పెంచేస్తున్నారు. అవును.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు టాలీవుడ్ యంగ్ స్టర్స్ అంతా గడ్డంగ్యాంగ్ లా తయారయ్యారు.
charan-beard-zee-cinemalu
సుకుమార్ సినిమా కోసం చెర్రీ ఇలా గడ్డం పెంచేశాడు. ఖైదీ నంబర్ 150 ప్రమోషన్స్ లో రామ్ చరణ్ న్యూ లుక్ చూశాం. తాజాగా సుబ్బరామిరెడ్డి, చిరంజీవికి చేసిన సన్మాన కార్యక్రమంలో చెర్రీ కంప్లీట్ మేకోవర్ లో కనిపించాడు. సుకుమార్ సినిమా కోసమే తను ఇలా ఫస్ట్ టైం గడ్డం పెంచుతున్నానని చెర్రీ ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు.
nithiin-look-for-hanuraghavapudi
మరో హీరో నితిన్ కూడా గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హను సినిమాల్లో హీరోకు గడ్డం కంపల్సరీ. మొదటి సినిమా అందాల రాక్షసితో నవీన్ చంద్ర గడ్డం అందరికీ తెలిసిందే. తాజాగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమగాథలో కూడా నానికి ఫుల్ గడ్డం ఇచ్చాడు. సో… నితిన్ కు కూడా గడ్డం పెంచక తప్పలేదు.
ram-beard-final
ఇక గడ్డం గ్యాంగ్ లో మూడో వ్యక్తి రామ్. ఈ కుర్రహీరో మ్యాగ్జిమం క్లీన్ షేవ్ లో ఉంటాడు. నేను శైలజలో క్యారెక్టర్ కు తగ్గట్టు సెకెండాఫ్ లో గడ్డంతో కనిపించాడు. కానీ ఈసారి తన కొత్త సినిమా కోసం ఏకంగా భారీస్థాయిలో గడ్డం పెంచుతున్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్.
ntr-beard-zee-cinemalu
ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా కొనసాగుతున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి గడ్డం మెయింటైన్ చేస్తున్న ఈ హీరో, బాబి దర్శకత్వంలో త్వరలోనే చేయబోతున్న సినిమాలో కూడా ఆ గడ్డం సంప్రదాయాన్ని కొనసాగించే ఛాన్స్ ఉంది. ఈమధ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద యంగ్ టైగర్ ను చూసిన చాలామంది ఇదే ఫీలయ్యారు.

collage

ఇక నాగార్జున, పవన్ కల్యాణ్ లాంటి హీరోలకు గడ్డాలు పెంచడం అస్సలు కొత్తకాదు. తన కొత్త సినిమా ఓం నమో వేంకటేశాయ కోసం నాగ్ గడ్డం పెంచాడు. కుదిరితే రాజుగారి గది-2 కోసం కూడా అదే గడ్డాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. ఇక పవన్ అయితే.. ఖాళీ దొరికినప్పుడల్లా గడ్డం పెంచేస్తూనే ఉంటాడు. తాజాగా గురుతో వెంకీ కూడా గడ్డంలోకి షిఫ్ట్ అయ్యాడు.