ఎట్టకేలకు సినిమా ఎనౌన్స్ చేశాడు...

Sunday,January 22,2017 - 09:14 by Z_CLU

లాస్ట్ ఇయర్ థియేటర్స్ లో సందడి చేయలేకపోయిన మాస్ మహారాజ్.. న్యూ ఇయర్ లో 2 సినిమాలతో ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు. మొన్నటి వరకూ హాలిడేస్ ఎంజాయ్ చేసిన ఈ సీనియర్ హీరో… మళ్ళీ సెట్స్ పైకి రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్న రవితేజ… వీటిలో ఒక సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.

లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవితేజ కొత్త సినిమా ఉంటుంది. నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మించనున్న ఈ సినిమాతో రచయిత విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గతంలో రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా చేసిన రాశిఖన్నా.. ఈ ప్రాజెక్టులో కూడా హీరోయిన్ గా ఫైనలైజ్ అయింది. ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు రాజా – ది గ్రేట్ అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై కూడా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. మొత్తానికి ఏడాది గ్యాప్ తర్వాత రవితేజ మళ్లీ స్వింగ్ లోకి వచ్చేస్తున్నాడన్నమాట.