కాంచన కౌంట్ డౌన్ స్టార్ట్.. మరో 3 రోజులు

Tuesday,April 16,2019 - 12:31 by Z_CLU

థియేటర్లలో సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమైంది కాంచన-3. మరో మూడు రోజుల్లో ఈ సినిమా  థియేటర్లలోకి రాబోతోంది. తన కెరీర్ లోనే ఇది ది బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నాడు లారెన్స్. అంతేకాదు, లారెన్స్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్ మూవీగా నిలవబోతోంది.

అవును.. ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది కాంచన-3. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 థియేటర్లలో ఈ సినిమా విడుదలకాబోతోంది. ఓవైపు హిందీలో అక్షయ్ కుమార్ తో కాంచన సినిమా రీమేక్ చేయబోతున్నాడు లారెన్స్. మరోవైపు కాంచన-3 డబ్బింగ్ వెర్షన్ బాలీవుడ్ కూడా విడుదలవుతోంది.

తనే నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, తమిళ్ లో సన్ పిక్చర్స్, తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు.

కాంచన-3 కేవలం హారర్ సినిమా కాదంటున్నాడు లారెన్స్. వేదిక, ఒవియా, నిక్కీ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో పాటలు బ్రహ్మా్ండంగా ఉంటాయంటున్నాడు. ఒక పాట కోసం అచ్చంగా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చుచేశామని.. పాటలతో పాటు మంచి కామెడీ, డ్రామా కూడా ఉంటుందంటున్నాడు.