ఎక్కువగా యాక్షన్ సినిమాలే కోరుకుంటున్నారు

Tuesday,April 16,2019 - 01:32 by Z_CLU

తన నుంచి ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్ సినిమాలే కోరుకుంటున్నారని అంటున్నాడు ప్రభాస్. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత నేషనెల్ లెవెల్లో ఆడియన్స్ అంతా తనను యాక్షన్ మోడ్ లో చూడాలని అనుకుంటున్నారని, అందుకే సాహో సినిమా చేస్తున్నానని అన్నాడు.

నేషనల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రభాస్.. సాహో సినిమాకు సంబంధించి పెద్దగా డీటెయిల్స్ వెల్లడించలేదు. కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందని అంటున్నాడు. సినిమా మొత్తం స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని నడుస్తుందని.. ఎక్కడా బోర్ కొట్టదని అంటున్నాడు. దర్శకుడు సుజీత్ మూడేళ్ల పాటు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట.

శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ ప్రముఖులు నటిస్తున్నారు. ఆగస్ట్ 15న విడుదలకానున్న సాహో సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. మే చివరి నాటికి షూటింగ్ పూర్తిచేయాలనేది టార్గెట్.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా లీక్ అయిన ఓ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్-శ్రద్ధకు సంబంధించిన ఈ స్టిల్.. ఓ సాంగ్ కు సంబంధించిందనే విషయం చూస్తేనే అర్థమౌతోంది.