కాంచన-3 రిలీజ్ కు లైన్ క్లియర్
Monday,April 08,2019 - 05:56 by Z_CLU
అన్నీ తానై లారెన్స్ తెరకెక్కించిన కాంచన-3 విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈనెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ విడుదలకానుంది.
లారెన్స్ అందించిన హారర్ కామెడీ చిత్రాలన్నీ సౌత్ లో సూపర్ హిట్ అయ్యాయి. ముని, కాంచన, కాంచన-2 సినిమాలన్నీ సూపర్ హిట్స్. ఇప్పుడు అదే సిరీస్ లో తెరకెక్కింది కాంచన-3. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాఘవ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో బి.మధు రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం రికార్డు స్థాయిలో 220 రోజులు వర్క్ చేశారు. కథ, గ్రాఫిక్స్, స్కీన్ ప్లే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. లారెన్స్ గెటప్ కు, తమన్ మ్యూజిక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. వేదిక, ఒవియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో లారెన్స్ కు ఎంతో ఇష్టమైన కోవై సరళ కూడా ఉన్నారు.