జెర్సీకి లైన్ క్లియర్.. సెన్సార్ పూర్తి

Tuesday,April 16,2019 - 11:16 by Z_CLU

నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటించిన జెర్సీ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు క్లీన్-U సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. సినిమాకు ఎలాంటి మ్యూట్స్, కట్స్ చెప్పలేదు.

మోస్ట్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది జెర్సీ సినిమా. పైగా ఇందులో క్రికెట్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. దీంతో సెన్సార్ అధికారులకు ఎక్కడా అశ్లీలం అనే పదం కనిపించలేదు. కనీసం అభ్యంతరకంగా ఉండే పదాలు కూడా వినిపించలేదు. అలా క్లీన్-Uతో థియేటర్లలోకి వస్తోంది జెర్ీ.

గౌతమ్ తిన్ననూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది.