కిక్కెక్కిస్తున్న కళ్యాణ్ రామ్

Thursday,September 08,2016 - 09:00 by Z_CLU

 

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. పూరి తన దైన స్టైల్ లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్న ‘ఇజం’ ఫస్ట్ లుక్ తో పాటు ఇటీవలే విడుదలైన టీజర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకూ కనిపించని న్యూ లుక్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విజయ దశమి కానుకగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..