ఈ హీరో స్పెషల్ సాంగ్ లో కూడా....?

Thursday,September 08,2016 - 11:40 by Z_CLU

జనతా గ్యారేజ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోయిన్లు సమంత, నిత్యామీనన్ కనిపిస్తారు. కానీ క్లయిమాక్స్ కు కొంచెం ముందొచ్చిన కాజల్ మాత్రం షో స్టాపర్ గా నిలిచింది. సినిమా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన ప్రేక్షకుల మనసుల్లో… ఐటెంసాంగ్ చేసిన కాజల్ మాత్రమే గుర్తుండిపోయింది. అంతలా తన మెస్మరైజింగ్ స్టెప్స్ తో కిక్కెక్కించింది కాజల్. కెరీర్ లో చేసిన మొట్టమొదటి ఐటెంసాంగ్ తో కిర్రాక్ పుట్టించింది. అందుకే కాజల్ ను తమ సినిమాల్లో ఐటెంసాంగ్స్ కోసం తీసుకునేందుకు హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

mahesh-babu-and-kajal

తాజాగా మహేష్ బాబు కూడా కాజల్ ను ఇదే యాంగిల్ లో చూస్తున్నాడట. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ తో ఐటెంసాంగ్ పెడితే బాగుంటుందని ప్రిన్స్ భావిస్తున్నాడు. ఈ మేరకు షాట్ గ్యాప్ లో మహేష్-మురుగదాస్ మధ్య బ్రీఫ్ డిస్కషన్ జరిగినట్టు సమాచారం. ప్రస్తుతానికైతే కాజల్, మెగాస్టార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ సినిమాలో ఐటెంసాంగ్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.