ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్న అర్జున్

Friday,April 12,2019 - 02:12 by Z_CLU

ప్రస్తుతం జెర్సీ ట్రయిలర్ తో దుమ్ముదులుపుతున్నాడు నాని. విడుదలైన కొద్దిసేపటికే 1 మిలియన్ వ్యూస్ తో అదరగొట్టిన నేచురల్ స్టార్, ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను కూడా అంతే సూపర్ హిట్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ & వెన్యూ ఫిక్స్ అయ్యాయి.

సోమవారం జెర్సీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. ట్రయిలర్ ఇప్పటికే పెద్ద హిట్ అవ్వడంతో యూనిట్ అంతా ఫుల్ జోష్ మూడ్ లో ఉంది. ఈ గ్యాప్ లో జూక్ బాక్స్ కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమాతో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాధ్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఏప్రిల్ 19న థియేటర్లలోకి రాబోతోంది జెర్సీ.