బన్నీ-త్రివిక్రమ్.. మ్యూజిక్ స్టార్ట్

Friday,April 12,2019 - 09:52 by Z_CLU

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

త్రివిక్రమ్-తమన్ మధ్య మంచి సింక్ ఉంది. ఈ విషయం అరవింద సమేత సినిమాతో రుజువైంది. ఆ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. ఇప్పుడీ కాంబినేషన్ కు బన్నీ కూడా కలిశాడు. బన్నీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో తమన్ కు బాగా తెలుసు. సో.. బన్నీ-త్రివిక్రమ్-తమన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో పాటలు అదిరిపోయే లెవెల్లో ఉండబోతున్నాయన్నమాట.

ఈనెల 24 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. హారిక-హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ.