చిన్న సినిమా పై రాజమౌళి ప్రసంశలు

Monday,August 01,2016 - 01:14 by Z_CLU

 

ఈ శుక్రవారం విడుదలైన ‘పెళ్లిచూపులు’ అనే చిత్రం టాలీవుడ్ లోని ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం బాహుబలి’ తో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ను దశ దిశలుగా వ్యాపించిన రాజమౌళి ను సైతం ఆకట్టుకుంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాను వీక్షించి తన స్పందన ను ట్విట్టర్ ద్వారా తెలిపారు జక్కన్న. ‘పెళ్లిచూపులు’ వంటి ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాను అందించిన్నదుకు ముఖ్యంగా దర్శకుడికి, నిర్మాతలకు అభినందనలు తెలిపారు రాజమౌళి. ఈ సినిమా రచన, దర్శకత్వం , నటీ నటుల ప్రతిభ అన్నీ ఆకట్టుకున్నాయని… ముఖ్యంగా ఈ చిత్రం లో హీరో ఫ్రెండ్ దర్శి బాగా అలరించారని అన్నారు. టీం అందరికీ కంగ్రాట్స్ తెలిపారు టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి.