కమల్ కు ఫోన్ చేసిన రజనీ... కారణం అదే ..!

Monday,August 01,2016 - 12:45 by Z_CLU

 

కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరు ఇద్దరే. తమ నటనతో కోలీవుడ్ లో ఇప్పటికీ టాప్ స్టార్స్ గా వెలుగుతున్న ఈ ఇద్దరు మంచి మిత్రులనే విషయం అందరికీ తెలిసిందే. పరస్పరం అప్పుడప్పుడూ కొన్ని సందర్భాల్లో కలుసుకొంటూ ఉంటారు కూడా. అయితే ఇటీవలే తన ఆఫీస్ లో జారిపడ్డంతో కమల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకూ విదేశీ పర్యటన లో ఉన్న రజినీ ఇటీవలే చెన్నై వచ్చారు. కొన్ని రోజులు ‘కబాలి’ హడావుడి లో బిజీ అయిన రజనీ ఈ మధ్యనే కమల్ ను కలిసి పరామర్శించాలనుకున్నారట. కానీ కమల్ కు ప్రస్తుతం ఒక సర్జరీ పూర్తి చేసి రెండో సర్జరీ జరుపుతున్న డాక్టర్స్ ఇప్పుడు పరామర్శించడానికి వీలు లేదని చెప్పడం తో రజనీ ప్రత్యేకంగా కమల్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇక రెండో సర్జరీ పూర్తయిన తరువాత కొన్ని రోజులు విరామం తీసుకొని మళ్ళీ శభాష్ నాయుడు చిత్రీకరణ లో కమల్ పాల్గొంటారు.