మళ్లీ సినిమాలపై ఇలియానా ఫోకస్

Friday,August 30,2019 - 03:58 by Z_CLU

రెండేళ్ల నుంచి లిమిటెడ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది ఇలియానా. ఇప్పుడీ గోవా బ్యూటీ మరోసారి మూవీస్ పై ఫోకస్ పెట్టాలనుకుంటోంది. కుదిరితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ అవ్వాలనుకుంటోంది. దీనికి ఓ కారణం కూడా ఉంది.

ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నేళ్లుగా క్లోజ్ గా ఉంటూ వస్తోంది ఇలియానా. రీసెంట్ గా వీళ్లిద్దరూ విడిపోయారు. సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన పిక్స్ అన్నీ డిలీట్ చేసింది ఇలియానా. అన్-ఫాలో కూడా కొట్టేసింది. అటు ఆండ్రూ కూడా అన్నీ క్లోజ్ చేసి లండన్ వెళ్లిపోయాడు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేక రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే విషయాన్ని పక్కనపెడితే, ఇద్దరూ విడిపోయారనేది మాత్రం ఫిక్స్.

అలా ఆండ్రూ నుంచి విడిపోయిన ఇలియానా, మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఒకప్పట్లా స్లిమ్ ఫిజిక్ కోసం ప్రస్తుతం జిమ్ బాట పట్టింది. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు ఇలియానా. ఈసారి ఆమె హిందీ సినిమాలతో పాటు తెలుగు ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉంది.