ఆది సాయికుమార్ ‘జోడీ’ ట్రైలర్ రిలీజయింది...

Friday,August 30,2019 - 01:50 by Z_CLU

ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన సినిమా ‘జోడీ’. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ 6 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు.

ట్రైలర్ ని బట్టి బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెలుస్తున్నా సినిమాలో బెట్టింగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ స్పేస్ ఉన్నట్టు తెలుస్తుంది. గొల్లపూడి మారుతి రావు గారు చెప్పిన డైలాగ్ ని బట్టి, సినిమా ‘బెట్టింగ్… లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్’ ల కాంబినేషన్ అనిపిస్తుంది.

 

సీనియర్ నరేష్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు. విశ్వనాథ్ అరిగెల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘జోడీ’ కి పద్మజ, సాయి వెంకటేష్ నిర్మాతలు. ఫణి కళ్యాణ్ మ్యూజిక్ కంపోజర్.