Ileana - నిజంగానే ఆత్మహత్యకు ట్రై చేసిందా?

Monday,May 03,2021 - 06:26 by Z_CLU

ఇలియానాపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. అవి కూడా అలాంటిలాంటి పుకార్లు కావు. మచ్చుకు కొన్ని చెప్పుకుందాం. ఫారిన్ ఫొటోగ్రాఫర్ వల్ల ఇలియానా గర్భవతి అయిందనేది అందులో ఒకటి. ఇక మరో పుకారులో, ఇలియానా ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించిందని, సకాలంలో పని మనిషి వచ్చి ఆ ప్రయత్నాన్ని ఆపిందనేది దాని సారాంశం. ఇలా ఇలియానాపై ఒకటి కాదు, రెండు కాదు.. మినిమం గ్యాప్స్ లో ఎన్నో పుకార్లు, మరెన్నో ఊహాగానాలు.

చాలా రూమర్స్ ను ఇలియానా లైట్ తీసుకుంది. కానీ ఈమధ్య అవి ఇంకాస్త ఎక్కువవ్వడం, మరీ ముఖ్యంగా తను సూసైడ్ కు ట్రై చేశానంటూ రూమర్స్ రావడంతో ఇలియానా స్పందించక తప్పలేదు. ఇప్పటివరకు తనపై వచ్చిన పుకార్లన్నీ నాన్సెన్స్ అని కొట్టిపారేసింది ఈ గోవాబ్యూటీ.

తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదంటోంది ఇలియానా. మరీ ముఖ్యంగా తన ఇంట్లో పని మనిషులు ఉండరని, ఎవరి పని వాళ్లు చేసుకుంటామని చెప్పుకొచ్చింది. ఇక ప్రెగ్నెంట్ అయిందనే పుకార్లపై స్పందిస్తూ.. తనకు ఇప్పటివరకు 3 సార్లు గర్భం వచ్చినట్టు మీడియా వాళ్లు సృష్టించారని నవ్వుతూ చెప్పింది.

ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తనపై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చింది ఇలియానా. కెరీర్ పరంగా చూసుకుంటే.. మరోసారి హిందీలో బిజీ అయింది ఈ బ్యూటీ. అజయ్ దేవగన్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. దీంతో పాటు మరో 2 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి.

Ileana_Stills_zeecinemalu

తెలుగు సినిమాలపై మాత్రం ఇలియానా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మూడేళ్ల కిందటొచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ఆమె టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది, ఇలియానా మళ్లీ తెలుగులో బిజీ అవుతుందని అనుకున్నారు. అందుకు తగ్గట్టే ఆమెకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఈ గోవా బ్యూటీ మాత్రం బాలీవుడ్ ప్రాజెక్టులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తోంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics